బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన జిల్లెల ఆదిత్య రెడ్డి 

బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన జిల్లెల ఆదిత్య రెడ్డి 

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు: 

వనపర్తి నియోజకవర్గం లోని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను సోమవారం కాంగ్రెస్ యువ నాయకుడు, ఏఐపిసి స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందిన వనపర్తి నియోజకవర్గం లోని బాధితులకు సోమవారం ఆయన నివాసంలో బాధితులకు 106 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఒక ఏడాదిలోనే అత్యధిక సీఎం సహాయనిది ద్వారా చెక్కులను అందించి పేదల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిది అండగా ఉంటుందని అన్నారు. చెక్కులు  అందుకున్న లబ్ధిదారులు ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోవనపర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సి పెంటన్న యాదవ్. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మత్స్యశాఖ అధ్యక్షుడు నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సమ్మద్ మియా. వనపర్తి మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బి. కృష్ణ,వనపర్తి జిల్లా కోర్ట్ ప్రభుత్వ న్యాయవాది లాయర్ కిరణ్, వనపర్తి యూత్ కాంగ్రెస్ నాయకులు లాయర్ బాబా, రాగి అక్షయ్ ,వనపర్తి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్, గోపాల్పేట్ కాంగ్రెస్ నాయకుడు జిల్లెలప్రవీణ్ రెడ్డి,పెద్దమందడి మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు,సీనియర్ నాయకులు రాగి వేణు, రామేశ్వర్ రెడ్డి, నాగార్జున, భాస్కర్ ,తిరుపతయ్య, రాములు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .