హైకోర్టు జడ్జి నగేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Views: 27
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ హైకోర్టు జడ్జి నగేష్ భీమపాక “ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్” పై నిర్వహించిన సెమినార్లో పాల్గొనడానికి హనుమకొండకు విచ్చేసిన సందర్భంగా, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో జడ్జి నగేష్ భీమపాకకు స్వాగతం పలుకుతూ, జిల్లా సంబంధిత విషయాలపై సౌహార్థ వాతావరణంలో చర్చించారు. భారత రాజ్యాంగ భావనలపై నిర్వహించే ఈ సెమినార్ జిల్లా అభివృద్ధికి మరింత శ్రేయస్కరమని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments