దివ్యాంగుల ఆశ్రమానికి సరుకులు అందజేత.
Views: 8
On
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ( ట్రస్మా )రాష్ట్ర నాయకులు సూరపనేని శేష్ కుమార్ మూడవ వర్ధంతి సందర్భంగా బుధవారం సత్తుపల్లి డివిజన్ ట్రస్మా ఆధ్వర్యంలో స్థానిక సిద్ధారం రోడ్ లో గల “దివ్యాంగుల సేవ ఆశ్రమం” వికలాంగులకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ప్రైవేటు విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి శేష్ కుమార్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థల సంఘ జిల్లా కార్యదర్శి నాయుడు వెంకటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు పసుపులేటి నాగేశ్వరరావు, సంఘ బాధ్యులు చీకటి శ్రీనివాసరావు, ప్రభాకర్ రెడ్డి, పులి శ్రీనివాసరావు, చైతన్య మురళి, శాంతినికేతన్ శ్రీనివాసరావు, స్వర్ణిక దివ్యాంగుల ఆశ్రమ నిర్వాహకులు వలపర్ల రవి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments