సమగ్ర కుటుంబ  సర్వేపై సందేహాలు వద్దు

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

సమగ్ర కుటుంబ  సర్వేపై సందేహాలు వద్దు

వరంగల్ నగరంలోని 24వ డివిజన్ లో సర్వే తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ 

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ కులగణన సర్వేపై సందేహాలు, అపోహలు అవసరం లేదని, ప్రజలు సర్వే ప్రక్రియలో భాగస్వాములై తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్ సత్య శారదా సూచించారు.సోమవారం వరంగల్ నగరం జిడబ్ల్యూ ఎంసీ లోని 24వ డివిజన్ ఫాటక్ మోహల్లా, ఎల్లంబజార్ లలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తీరును క్షేత్ర స్థాయిలో
కలెక్టర్ పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న తీరును, నిర్ణీత ఫారాలలో ఆయా కోడ్‌ ల వారీగా వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని గమనించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇంటింటి కుటుంబ సర్వేలో సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి సేకరించిన సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.ఎలాంటి అవాంతరాలు లేకుండా జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోందని, ప్రజల నుండి సేకరించిన సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆన్‌ లైన్‌ లో నమోదు చేసేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ రామిరెడ్డి, సిపిఓ గోవిందరాజన్, ఉప కమిషనర్ కృష్ణారెడ్డి, ఆర్ ఓ షాజాదిబేగం, ఆర్ ఐ సోహైల్, గణకులు తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .