గుర్రపు డెక్క పూర్తిగా తొలగించేవరకు కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించవద్దు
కార్పొరేటర్ శాంతి సాయిజన్
నాచారం, డిసెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
కాప్రా మున్సిపాలిటీలో నాచారం పరిధిలోని హెచ్ఎంటి నగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా దోమల సమస్య తీవ్రంగా పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా హెచ్ఎంటి పెద్ద చెరువులో విస్తృతంగా పేరుకుపోయిన గుర్రపు డెక్కను కార్పొరేటర్ శాంతి సాయిజన్ పేర్కొన్నారు.హెచ్ఎంటి పెద్ద చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, నిర్వహణ పనులకు సంవత్సర కాలానికి కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్ ఒకసారి మాత్రమే పూర్తిగా గుర్రపు డెక్కను తొలగించి, సుమారు నాలుగు నుంచి ఐదు నెలల క్రితం ఎఫ్‌టీసీ యంత్రాన్ని అక్కడి నుంచి వేరే చెరువుకు తరలించారని తెలిపారు. అప్పటి నుంచి చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, మెయింటెనెన్స్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు.ఈ విషయమై ఎంటమాలజీ ఎస్ఈ మాధవరెడ్డిని హెచ్ఎంటి చెరువు వద్దకు కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ పిలిపించారు. గుర్రపు డెక్క తొలగింపు కాంట్రాక్టును ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని సమాచారం రావడంతో, చెరువులోని గుర్రపు డెక్క పూర్తిగా తొలగించే వరకు కాంట్రాక్టర్కు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని ఎల్బీనగర్ ఇంజనీరింగ్ ఎస్ఈ అశోక్ రెడ్డికి ఫోన్ ద్వారా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సాయిజన్ శేఖర్, విట్టల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, మోహన్ రెడ్డి, ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, మక్బూల్, నర్సింగ్ రావు, వాసు, వీరాంజనేయులు, రవీందర్ రెడ్డి, రామరాజు, బాలరెడ్డి, సుభాస్కర్, యాదగిరి రెడ్డి, చంద్రశేఖర్, కొండయ్య, ఎంటమాలజీ సూపర్వైజర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.


Comments