అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కు డాక్టరేట్ ప్రధానం
సమాజ సేవ, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటానికి గుర్తింపు
గౌరవ డాక్టరేట్ కు దోహదపడిన వనపర్తి ప్రజలకు రుణపడి ఉంటా
-- అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్
వనపర్తి,తెలంగాణ ముచ్చట్లు:
18 ఏళ్లుగా ప్రజా సమస్యలపై నిరంతరంగా పోరాడుతూ.. సామాజిక సేవలో విశేషంగా సేవలందించిన వనపర్తి మాజీ కౌన్సిలర్ అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. శనివారం పాండిచ్చేరి రాష్ట్రంలో గ్లోబల్ అక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్ ఐపియూజే యూనివర్సిటీ ప్రతినిధులు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి ప్రముఖులకు ఈ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయగా తెలంగాణ రాష్ట్రం నుంచి సామాజిక సేవ, ప్రజల శ్రేయస్సు విభాగంలో సతీష్ యాదవును ఎంపిక చేశారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించి ,నా సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వడం గర్వంగా ఉందని, కృష్ణాష్టమి రోజున అందుకోవడం నా అదృష్టం అని అలాగే ఇది నాకు మరింత బాధ్యతను పెంచిందని సతీష్ యాదవ్ తెలిపారు. నాకు లభించిన గౌరవానికి దోహదపడిన వనపర్తి పట్టణ జిల్లా ప్రజానీకానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఇది రాబోవు కాలంలో వనపర్తి జిల్లా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments