సర్వేలో తప్పిదాలకు తావివ్వొద్దు

-అర్హులకు లబ్ధి చేకూర్చాలి

సర్వేలో తప్పిదాలకు తావివ్వొద్దు

-శిథిలావస్థలోని ఇళ్లలో ఉంటున్న వారి వివరాలనూ సేకరించాలి.

-అధికారులకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశం

చిన్నశంకరంపేట,తెలంగాణ ముచ్చట్లు:

 ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పిదా లకు తావివ్వొద్దని, అర్హులకు లబ్ది చేకూరేలా యా ప్లో వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల పరిధిలో  
 మాందాపూర్ గ్రామంలో కొన్నసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ వివరాల నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం పరిశీలించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న 469 గ్రామపంచాయతీలలో నాలుగు మున్సిపాలిటీలలోగల 75 వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే అత్యంత పారదర్శకంగా  కొనసాగుతుందని మొదటి విడతగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేయడం జరుగుతుందని, విడతల వారీగా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు.  శిథిలావస్థకు చేరిన పురాతన ఇళ్లలో నివాసముంటున్న వారు కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు వస్తే వారి వివరాలను సైతం యాప్లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఒక్కో దరఖాస్తుదారుని పూర్తి వివరాలను నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతోంది. రోజుకు సగటున ఎన్ని కుటుంబాల వివరాలను నమోదు చేస్తున్నారు, సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురువుతున్నాయని జిల్లా  కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంతమంది వివరాలు సేకరించారు. ఆన్లైన్లో ఎన్ని అప్లోడ్ చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ  ప్రక్రియలో భాగంగా సర్వే వేగవంతం అయ్యేందుకు..సంబంధిత పత్రాలను దరఖాస్తుదారులు  అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి దామోదర్, పంచాయతి కార్యదర్శి కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .