వైద్యం వికటించిన సంగమ్మను పరామర్శించిన మండల వైద్యాధికారి డాక్టర్ హర్షిత.
ప్రభుత్వ ఆసుపత్రిలో సంగమ్మకు మెరుగైన వైద్యం అందిస్తాం..
మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:
పత్రికలో ప్రచురించిన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఎల్లకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని శేరిపల్లి గ్రామాన్ని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ హర్షిత, ఎల్లకుర్తి పల్లె దవాఖానా వైద్యాధికారి ఉదయభాను లు, పట్లోళ్ల సంగమ్మ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. సంగమ్మకు మెరుగైన వైద్యం అందిస్తాం అని చెప్పి టేక్మాల్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందించారు. సంగమ్మ కు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేలా చూస్తామని సంగమ్మకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులున్నా మా దృష్టికి తేవాలని ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తిన వైద్యం విషయంలో పూర్తి బాధ్యత తమదే నంటూ గ్రామ పెద్దల సమక్షంలో సంగమ్మ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చిన మండల వైద్యాధికారి, ఈ విషయంపై డాక్టర్ హర్షిత ను విలేకరులు వివరణ కోరగా అందుకు నిరాకరించిన డాక్టర్ సంబంధిత జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని. మాపై అధికారులను అడిగి వివరణ ఇస్తామంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు.


Comments