అమ్మవారి నిమజ్జనాల్లో పాల్గొన్న  గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్

అమ్మవారి నిమజ్జనాల్లో పాల్గొన్న   గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్

ఉప్పల్, అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు)

శ్రీ దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల అనంతరం ఉప్పల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఘనంగా నిర్వహించిన అమ్మవారి నిమజ్జన కార్యక్రమాల్లో గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. భక్తులతో కలిసి అమ్మవారికి పూజలు చేసి, నిమజ్జన శోభాయాత్రలో భాగమయ్యారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ — “నవరాత్రులు భక్తి, శక్తి, సానుకూలతకు ప్రతీక. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.ఈకార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళా మండలి సభ్యులు, యువకులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా నిమజ్జనోత్సవాలను నిర్వహించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .