పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలి

పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలి

ఖమ్మం బ్యూరో, నవంబర్ 11, తెలంగాణ ముచ్చట్లు;

తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఖమ్మం జిల్లా శాఖ మంగళ వారం నుండి పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కార నిమిత్తం రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దీక్షా శిబిరాన్ని జిల్లా శాఖ అధ్యక్షులు మల్లికార్జున రావు గారు ప్రారంభించగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు  ఎల్ గోపీచంద్ కళ్యాణం నాగేశ్వరరావు  మాట్లాడుతూ దాదాపు 18 నెలల క్రితం నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు రావలసిన బకాయలు చెల్లించకపోగా కనీసం వారు దాచుకున్న జిపిఎఫ్ సొమ్ములు కూడా ఇన్ని నెలపాటు ఇవ్వకపోవడం అనేది దుర్మార్గమైన విషయమని వెంటనే రిటైర్ అయిన ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటిని  చెల్లించాలని నగదురహిత హెల్త్ కార్డులను అందించాలని, 2023 జులై 1నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలిగిన పిఆర్సి ప్రకటించాలని, మరియు పెండింగ్ లో ఉన్న 5 డా ర లను విడుదల చేయాలనీ డిమాండ్ చేయడం జరిగింది. నిరాహార దీక్ష లో  యుడివిఎస్ రత్నకుమార్, వి అంజయ్య, ఎల్  హరి సింగ్, టి మురళీధర్ రావు, చావా వెంకటేశ్వరరావు  కూర్చోడం జరిగింది. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి పూర్వ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాములు , వై రవి కుమార్, మాధవరావు, భారతిలు ప్రసంగించడం జరిగింది.రేవా బాధ్యులు  జైరామ్, లక్ష్మయ్య, రామారావు, శ్రీనివాస్ రావులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .