పెద్దపెండ్యాలలో ఘనంగా దసరా వేడుకలు
Views: 21
On
పెద్దపెండ్యాల,అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని పెద్దపెండ్యాల గ్రామంలో దసరా పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. విజయదశమి సందర్భంగా గ్రామస్తులు జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి, గ్రామ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను భక్తి శ్రద్ధలతో జరిపారు.సాంప్రదాయం ప్రకారం విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజలు చేయడం శుభప్రదమని విశ్వసిస్తారు. జమ్మి ఆకులను “సువర్ణం”గా భావించి ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. విజయం, ఐశ్వర్యం, శుభఫలితాలకు సూచికగా భావించే ఈ ఆచారాన్ని గ్రామస్తులు ఎంతో భక్తితో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి,నాయకులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments