దమ్మాయిగూడలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగింపు

దమ్మాయిగూడలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగింపు

దమ్మాయిగూడ,అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని శివానందపూర్ కాలనీలో పదకొండు రోజులపాటు నిర్వహించిన శ్రీ కనకదుర్గాదేవి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అమ్మవారి శోభాయమాన అలంకరణలు, శక్తి తాండవాలు భక్తులను ఆకట్టుకున్నాయి. నవరాత్రి ఉత్సవాలు భక్తి, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనంగా సాగి విజయదశమి రోజున ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.

ఆలయ కమిటీ చైర్మన్ సుప్రీత్ రెడ్డి (సినీనటుడు కాట్రాజ్), అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రాజు, ప్రధాన కార్యదర్శి సి.హెచ్. గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. కమిటీ సభ్యుల సమిష్టి సహకారంతో వేడుకలు మరింత భక్తిపరంగా, ఆధ్యాత్మికంగా జరిగాయి.విజయదశమి సందర్భంగా ఉరేగింపు, చక్రస్నానం, మహాపూర్ణాహుతి ఘనంగా నిర్వహించగా, అనంతరం భక్తులందరికీ మహా ప్రాసాదం పంపిణీ చేశారు. ఉత్సవాల ముగింపునకు వందలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీర్వాదాలను పొందారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .