ప్రతి ఆర్టీఐ దరఖాస్తుకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి
రవికుమార్ ఆర్టిఐ ఆక్టివిటీ ఫోరం జిల్లా అధ్యక్షులు
మదనాపురం,అక్టోబర్8(తెలంగాణ ముచ్చట్లు):
సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న ప్రతి దరఖాస్తుకూ తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ ఆక్టివిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు రవికుమార్ తెలిపారు.ఆర్టీఐ వార్షికోత్సవాల సందర్భంగా.. వనపర్తి జిల్లా ఆర్టీఐ ఆక్టివిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం–2005ను పకడ్బందీగా అమలు చేస్తున్న నేపథ్యంలో, అక్టోబర్ 12న జరగనున్న అవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల గణేష్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మండలంలో సమాచారం కోసం రోజుకు 20–25 దరఖాస్తులు సమర్పిస్తున్నామని తెలిపారు.బుధవారం మదనాపురం మండల ఎంపీడీవో కార్యాలయంలో అధికారులకు ఆర్టీఐ దరఖాస్తులు అందజేసినట్లు వివరించారు. అక్టోబర్ 12 వరకు జిల్లాలోని అన్ని శాఖల కార్యాలయాలలో ప్రతిరోజూ ఇలాంటి దరఖాస్తులు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఐ ఆక్టివిటీస్ కమిటీ సభ్యులు జి. రవికుమార్, మహబూబ్నగర్ జిల్లా కమిటీ సభ్యుడు మంగరాయి వెంకటేష్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Comments