దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఇమ్మానుయేల్ రాజ్
వేలేరు,తెలంగాణ ముచ్చట్లు:
వేలేరు మండలం సోడషపల్లి గ్రామంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర కుమారుడు, యువ నాయకుడు ఇమ్మానుయేల్ రాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇమ్మానుయేల్ రాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, దుర్గామాత అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా, గ్రామం పచ్చగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయనకు శాలువాతో సత్కారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు దయ్యాల స్వామి, గ్రామ ప్రధాన కార్యదర్శి మహేష్, వైస్ ప్రెసిడెంట్ నమిండ్ల భాస్కర్, మహిళా అధ్యక్షురాలు కొట్టే స్వప్న, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, చిల్పురు బీసీ మండల అధ్యక్షుడు బాలరాజు, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు లవన్ కుమార్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సలీమ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు రణధీర్, మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు సింగపురం దయాకర్, జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ సింగపురం నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments