మంత్రి సీతక్కకు సమగ్ర శిక్ష ఉద్యోగుల వినతి

మంత్రి సీతక్కకు సమగ్ర శిక్ష ఉద్యోగుల వినతి

వేలేరు,తెలంగాణ ముచ్చట్లు: 

తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ తరఫున మంత్రి సీతక్కకు మండల కేంద్రం వేలేరు వద్ద వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు మాట్లాడుతూ తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించడం కష్టమవుతుందని, పిల్లలకు ఉన్నత విద్య అందించలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వారి పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజ్ కుమార్, మేఘమాల, జోష్ణ, రోజా తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది, కేజీబీవీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .