కురుస్తున్న వర్షాల దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలి

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచనలు

కురుస్తున్న వర్షాల దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలి

వనపర్తి,సెప్టెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలు చేయరాదని ఆయన పేర్కొన్నారు.
మట్టి మిద్దెల్లో, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్చరించారు. వాగులు, వంకలు దాటేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.
వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు సహకరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో నేరుగా తనను సంప్రదించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
ఎమ్మెల్యే: 9494216666
జిల్లా కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్: 08545-220351, 08545-233525
ప్రజల భద్రతే తనకు ముఖ్యమని, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  ప్రజలను కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .