ప్రతి ఒక్కరు కనీసం ఒక చెట్టుని నాటాలి
-ఎర్ర రనూప,డాన్ బోస్కో యూత్ కో ఆర్డినేటర్
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు ప్రతి ఒక్కరు కనీసం ఒక్క చెట్టునైనా నాటాలని డాన్ బోస్కో యూత్ కో ఆర్డినేటర్ ఎర్ర రనూప ప్రజలకు పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు ప్రతి పౌరుడు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు. ఆదివారం మండలంలోని తాటికాయల గ్రామంలో ఉన్న ఫాతిమా మాత దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్బముగా ఎర్ర రనూప మాట్లాడుతూ ...మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలని కోరారు.పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతీ ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని అన్నారు.మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డాన్ బోస్కో యూత్ సభ్యులు స్వప్న,శేఖర్,శ్యామ్, జ్యోత్స్నా,బిందు,ప్రణీత,మేరీ ,జితిన్,లక్కీ,అక్షిత్ తదితరులు పాల్గొన్నారు.


Comments