ప్రతి ఒక్కరు కనీసం ఒక చెట్టుని నాటాలి  -ఎర్ర రనూప,డాన్ బోస్కో యూత్ కో ఆర్డినేటర్ 

ప్రతి ఒక్కరు కనీసం ఒక చెట్టుని నాటాలి   -ఎర్ర రనూప,డాన్ బోస్కో యూత్ కో ఆర్డినేటర్ 

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు ప్రతి ఒక్కరు కనీసం ఒక్క చెట్టునైనా నాటాలని డాన్ బోస్కో యూత్ కో ఆర్డినేటర్  ఎర్ర రనూప  ప్రజలకు పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు ప్రతి పౌరుడు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు. ఆదివారం మండలంలోని తాటికాయల గ్రామంలో ఉన్న ఫాతిమా మాత దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్బముగా ఎర్ర రనూప మాట్లాడుతూ ...మొక్కలు నాటి భవిష్యత్‌ తరాలకు మంచి ఆక్సిజన్‌ అందించాలని కోరారు.పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతీ ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని ‌ అన్నారు.మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డాన్ బోస్కో యూత్ సభ్యులు స్వప్న,శేఖర్,శ్యామ్, జ్యోత్స్నా,బిందు,ప్రణీత,మేరీ ,జితిన్,లక్కీ,అక్షిత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .