సంత్ సేవాలాల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి

సంత్ సేవాలాల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి

WhatsApp Image 2025-02-15 at 8.22.02 PMజిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: 

సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం బంజారా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఇల్లందు క్రాస్ రోడ్ లో గల కార్తీక వనంలో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కలెక్టర్ ను బంజారా సాంప్రదాయం ప్రకారం బంజారా ఉద్యోగులు సంప్రదాయం పద్దతిలో తలపాగా చుట్టి ఎద్దుల బండి పై వేదిక వద్దకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ సంపత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి, భోగ్ బండారొ , వింతి కార్యక్రమాలను నిర్వహించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. సంత్ సేవాలాల్ తన బోధనల ద్వారా బంజారా జాతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. తండాల నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. హింస, మత్తు, ధూమపానాలకు  దూరంగా ఉండాలని హితువు పలికి యావత్ ప్రజానీకానికి ఆదర్శంగా నిలిచారని, బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విప్లవ చైతన్య మూర్తి అని, దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపించిన మార్గం అందరికీ ఆదర్శనీయమన్నారు. సేవాలాల్ మహారాజ్ తన బోధనల వల్ల బంజారా జాతి పురోగమించడానికి తో కృషి చేశారని పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో మనమందరం పయనించి  ఆయన ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో లో జిల్లా,వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, డిసిహెచ్ఎస్ రవిబాబు, జి జి హెచ్ ఆర్ ఎం ఓ  రమేష్ బంజారా వైద్యులు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు .

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .