రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!
ఎమ్మెల్యే మట్టా రాగమయి.
Views: 4
On

సత్తుపల్లి, ఆగస్టు 20(తెలంగాణ ముచ్చట్లు):
భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా, బుధవారం సత్తుపల్లి పట్టణంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతులు. అనంతరం
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేశారు.రాగమయి మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గాదె చెన్నారావు, చల్లగుళ్ళ నరసింహారావు, రవీందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, తోట సుజలారాణి, చల్లగుళ్ళ కృష్ణయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments