యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం

గుంపల్లి రాములు కుటుంబాన్ని అభినందించిన కాగితాల మధు

యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం

నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచిన వంశీ

ఖిల్లా ఘనపూర్,సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం జరిపినట్లు సంస్థ అధ్యక్షులు కాగితాల మధు తెలిపారు.
వివరాల్లోకి వెళితే, ఖిల్లా గణపురం మండలం గట్టుకాడిపల్లి గ్రామానికి చెందిన గుంపల్లి రాములు కుమారుడు గుంపల్లి వంశీ (24) నిన్న కొత్త మొల్గర సమీపంలో ఆటో బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, వంశీ నేత్రాలను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా దానం చేశారు. వాటిని హైదరాబాద్ ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు.
“నా కుమారుడు ఇక లేడు కానీ, మరొకరి కళ్ళ రూపంలో కనిపిస్తాడు” అని గుంపల్లి రాములు చెప్పడంతో గ్రామస్థులు ఆయనను అభినందించారు.
“ఎవరైనా అనుకోని మరణం జరిగితే ఆరు గంటల లోపు నేత్రదానం చేయాలి. యువత నేత్రదానం పట్ల అవగాహన పెంపొందించుకోవాలి” అని యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాగితాల మధు పిలుపునిచ్చారు.
నేత్రదానం చేయాలనుకునేవారు 9908806285 కు సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంటి కొర్నియా నిపుణుడు శివ, యువశక్తి ఫౌండేషన్ అధ్యక్షులు కాగితాల మధు, మాజీ సర్పంచ్ దేవేందర్, ఆమ్రోజి రాములు, ఖాదర్, శంకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .