భవన్స్ కాలేజీలో అధ్యాపకుల శిక్షణ తరగతులు
మల్కాజ్గిరి, సెప్టెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు)
మల్కాజిగిరి నేరేడ్మెట్‌లోని భవన్స్ విద్యా సంస్థలు, సైనిక్‌పుర్ కేంద్రంలోని కంప్యూటర్ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అధ్యాపకుల శిక్షణా కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. వారం రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణా తరగతులు సెప్టెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి.ప్రారంభోత్సవానికి ఎయిర్ కామడోర్ (విరమణ) జే ఎల్ ఎన్ శాస్త్రి, కాలేజీ ప్రిన్సిపల్ జి.ఎస్.వి.ఆర్.కె. చౌదరి, ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి రామ్ చంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని దీపప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న ఈ రోజుల్లో అధ్యాపకులు కేవలం మార్గదర్శకులుగానే కాకుండా విద్యార్థులను నడిపించగల సామర్థ్యం పెంపొందించు కోవాలని ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.అలాగే పాల్గొన్న అధ్యాపకులకు ప్రత్యక్ష అనుభవం కలిగే విధంగా ప్రాక్టికల్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.


Comments