సినర్జీ ఉత్పత్తులతో ఫామాయిల్ మంచి దిగుబడి

ఫామాయిల్ రైతులకు సినర్జీ ఒక భరోసా

సినర్జీ ఉత్పత్తులతో ఫామాయిల్ మంచి దిగుబడి

 భూమి, పంట, తెగుళ్లకు సినర్జీ ఒక పరిష్కారం
 సినర్జీ రీజనల్ మేనేజర్ యరమల వీరమోహన్ రెడ్డి

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 5 , తెలంగాణ ముచ్చట్లు;

సినర్జీ ఉత్పత్తుల ద్వారా ఫామాయిల్ రైతులకు మంచి దిగుబడి వస్తోందని, గత 16 సంవత్సరాలుగా ఫామాయిల్ రైతులకు సినర్జీ ఆత్మ విశ్వాసంతో కూడిన ఆర్థిక భరోసా కల్పిస్తూ వస్తుందని సినర్జీ రీజనల్ మేనేజర్ యరమల వీరమోహన్ రెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఫామాయిల్ రైతులు పాల్గొని "సీనర్జీ క్రాప్ ప్రొటెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్" వారి ద్వారా మంచి దిగుబడికి కావలసిన సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ యరమల వీరమోహన్ రెడ్డి మాట్లాడుతూ... సినర్జీ గ్రూపు స్థాపించి 16 వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. దాదాపు 150 రకాల మందులు రైతుకు ఉపయోగపడే విధంగా నాణ్యతకు ఏ మాత్రం తీసిపోకుండా సహకారం అందిస్తుందన్నారు. ఫామాయిల్ పంటకు పురుగు మందులు, తెగుళ్ల మందులు, కలుపు మందులు, సూక్ష్మ పోషక పదార్థాలు, స్థూల పోషక పదార్థాలు, నేలలో వేయుటకు కావలసిన వాటర్ సొల్యూషన్స్ తో పంటకు ఏ తెగులు వచ్చిన మందులు ఉన్నాయని, రైతులకు నమ్మకమైన సర్వీస్ అందిస్తామని తెలిపారు. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే భూమిలోపల సూక్ష్మ జీవులు పుష్కలంగా ఉండాలని, అవి ఉండాలంటే సముద్రపు నాచుతో తయారైన సి వీడ్ గ్రాన్యూల్స్ సిన్ జైమ్ వాడాలని, వామ్ టెక్నాలజీతో తయారైన మనిగోల్డ్ వాడాలని తెలిపారు. అదేవిధంగా పంటలు ఆరోగ్యంగా ఉండాలంటే మైక్రో న్యూట్రిఎంట్ వాడే ఆవశ్యకత ఉందని ముఖ్యంగా ఎఫ్ 7, ఎఫ్6, ఎఫ్4 తప్పనిసరిగా పంట కీలక దశలలో వాడాలని నొక్కి చెప్పారు. సినర్జీ కంపెనీ రైతుల సంక్షేమం పరమావధిగా భావించి రైతు సదస్సులలో రైతులకు తెలియజేస్తున్నామని అన్నారు. సినర్జీ క్వాలిటీ కి ప్రాధాన్యతనిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినర్జీ డెవలప్మెంట్ మేనేజర్ కట్ట వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ ఏరియా మేనేజర్ అభిమల్ల నాగేశ్వరరావు, సేల్స్ ఆఫీసర్స్ ఎస్.కె నాగుల్ మీరా, జి. ప్రతాప్, టి. సంతోష్, డి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .