పీచరలో PACS ద్వారా వరి కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
తెలంగాణ ముచ్చట్లు వేలేరు 28 అక్టోబర్ 2025
వేలేరు మండలం పీచర గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైతులు ఆవేదన వ్యక్తం చేసారు సోమవారం గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా ఐకేపీ నిర్వాహకులు గ్రామంలో ధాన్యాన్ని ఐకేపీ ద్వారానే సేకరించాలని సూచించగా pacs సొసైటీ ద్వారా కొనుగోలు చేయకూడదని పేర్కొన్నారు. దీనితో pacs ఆధ్వర్యంలో కూడా వరి కొనుగోలు చేయాలనీ PACS డైరెక్టర్ మాచర్ల కనకరాజు డిమాండ్ చేశారు ఒకే ఐకేపీ ఉంటే దాన్యం సేకరణలో ఆలస్యం అవుతుందని PACS కూడా కొనుగోలు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. కొంతమంది స్వలాభం కోసం pacs ను పక్కన పెట్టి ఐకేపీ ద్వార మాత్రమే కొనుగోలు చేయాలనుకోవడం రైతుల సమస్యలకు దారి తీస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో pacs డైరెక్టర్ మాచర్ల కనకరాజు, మాజీసర్పంచ్ మ్యాక రవీందర్,md జానీ, పోలు తిరుపతి,కొలిపాక వెంకటేష్, md హరీఫ్,మ్యాకల యాదయ్య, అవునూరి శ్యామ్,గోళ్లేనా రమేష్,పెండ్యాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు


Comments