నేల సారవంతానికి రైతులు పీఎస్బీ ని వినియోగించాలి 

ఖమ్మం అర్బన్ వ్యవసాయ విస్తరణ అధికారి బాలబత్తుల శిరిణ్మయి 

నేల సారవంతానికి రైతులు పీఎస్బీ ని వినియోగించాలి 

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

 రైతులు పాస్పరస్ సాల్యూ బులైజింగ్ బ్యాక్టీరియా (పీఎస్బీ) వాడటం ద్వారా నేల సారవంతం అవుతుందని ఖమ్మం అర్బన్ వ్యవసాయ విస్తరణ అధికారి బాలబత్తుల శిరిణ్మయి అన్నారు. పీఎస్బీ వినియోగం ద్వారా వరి, పెసర పంటలలో అధిక ఆదాయాన్ని పొందవచ్ఛని అన్నారు. బుధవారం వి వెంకటయపాలెం రైతువేదికలో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా రైతు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఫాస్పరస్-సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా (పీఎస్బీ) వ్యవసాయానికి, కమతాల్లో మట్టి ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఇవి మట్టిలో ఉన్న అసొల్యూబుల్ ఫాస్పరస్‌ను పంటలు ఆహారం తీసుకోగలిగిన సొల్యూబుల్ రూపాలకు మార్చుతాయన్నారు.
క్లస్టర్ లో ఈ పథకం ద్వారా 35 ఎకరాల్లో వరి, అపరాలు పండించే రైతులకు 50 శాతం సబ్సిడీతో పీఎస్బీని అందిస్తున్నామన్నారు. ఈ పీఎస్బీ ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .