కొడుకు పట్టించుకోవడం లేదని, రూ.3 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన తండ్రి  

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారికి గుణపాఠం కావాలి

కొడుకు పట్టించుకోవడం లేదని, రూ.3 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన తండ్రి  

ఎల్కతుర్తి,అక్టోబర్15(తెలంగాణ ముచ్చట్లు): 

తన కొడుకు పట్టించుకోవడం లేదని, రూ.3 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి (2006–11) ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో నివసిస్తున్న ఆయన మాట్లాడుతూ, తన కొడుకు రంజిత్ రెడ్డి తాను సొంతంగా సంపాదించిన ఆస్తులను లాక్కొని ఇంటి నుండి గెంటేశాడని, కూతురికి కట్నం కింద ఇచ్చిన భూమిని కూడా ఆక్రమించాడని తెలిపారు.

తన భార్య పేరిట ఉన్న భూమిని కూడా బలవంతంగా తీసుకున్నాడని, దీనిపై ప్రశ్నించగా తనపైనే దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకున్న 6 ఎకరాల భూమిలో 3 ఎకరాలను ప్రభుత్వానికి దానం చేయాలని నిర్ణయించినట్లు హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌కు తెలిపారు.ఆ స్థలంలో తన భార్య వసంత జ్ఞాపకార్థంగా ఒక భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరిన ఆయన, “తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంతానానికి ఇది గుణపాఠం కావాలి” అని అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .