క్లాస్మేట్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం
Views: 19
On
జనగామ జిల్లా, తెలంగాణ ముచ్చట్లు:
పాలకుర్తి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 1993–94 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన క్లాస్మేట్ చిట్యాల సంపత్ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. ఈ నేపథ్యంలో అతని కుటుంబానికి తోడుగా నిలుస్తూ సహపాఠులు కలిసి 40 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.శనివారం రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని సంపత్ కుమారుడు చిట్యాల వికాస్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిఆర్ శర్మ, వెంకటేశ్వరరావు, నాగరాజు, శ్రీను, లక్ష్మణ్, సొమ్మల్లు, పరమేశ్వర్, ప్రవీణ్, సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments