మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం - మానవత్వం చాటిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి
Views: 27
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన దయ్యాల వెంకటమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెగా రెడ్డి మానవత్వంతో స్పందించి మృతురాలి కుటుంబానికి 5000/-రూపాయలు ఆర్థిక సహాయం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి ద్వారా అందజేయడం జరిగింది. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతురాలి పార్థీవ దేహానికి నివాళులు అర్పించి సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాలచంద్రయ్య, సీనియర్ నాయకులు డి .ఎస్ మహేష్ , దయ్యాల శేఖర్, దయ్యాల రమేష్, వడ్డే శేఖర్, పట్నం సత్యన్న, కుమ్మరి కొండన్న, చందు, నాగభూషణ్, కానాపురం మన్నెం, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments