మెదక్ చర్చికి 100 సం.లుగా విశ్వాసం నమ్మకం దేవుని కృప కు మార్గనిర్దేశనం.

అనేక మంది జీవితల మార్పుకు శ్రీకారం

మెదక్ చర్చికి 100 సం.లుగా విశ్వాసం నమ్మకం దేవుని కృప కు మార్గనిర్దేశనం.

- విజయానికి క్రీస్తు బోధనలకు జీవం ఇచ్చే ప్రతీక.

- శాంతి కోరేవారికి మెదక్ చర్చి ప్రతీక.

--- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ.

మెదక్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22: తెలంగాణ ముచ్చట్లు:

గవర్నర్ కు ఘనంగా స్వాగతం పలికిన మెదక్ శాసనసభ్యులు మైనం పల్లి రోహిత్ రావు  ఆదివారం మెదక్ జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ముందుగా స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిలు, పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవ జిష్ణు దేవ్ వర్మ  ఆదివారం మెదక్ చర్చికి రాక సందర్భంగా గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత చర్చి ప్రాంగణంలోకి రాగానే మెదక్ ఆర్డీఓ రమాదేవి రాష్ట్ర గవర్నర్ గారికి పూల బొకే అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. చర్చి నిర్వాహకులు రెడ్ కార్పెట్ వేసి ఘనమైన స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ క్రీస్తు శిలువ వద్దకు వెళ్లి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం గురువులు గవర్నర్ ను శాలువా, చర్చి నమూనా విగ్రహాన్ని గవర్నర్ కు అందజేశారు.
మెదక్ చర్చి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ. సన్మాననీయ అతిథులు, సోదరులు, సోదరీమణులు, పిల్లలు, ఈరోజు మెదక్ లో కాథెడ్రల్‌లో ఈ ఆనందకరమైన సందర్భంగా ఒకటిగా సమావేశమై ఉన్న మీ అందరికీ శుభాకాంక్షలు  తెలిపారు.
మెదక్ కాథెడ్రల్ 2024 శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు.
 చర్చికి 100 సంవత్సరాల సంబరమే కాదు, విశ్వాసం, తపన ఆ భగవంతుని అమోఘమైన కృపకు నిదర్శనంగా నిలిచే ఒక మహత్తర ఘట్టం అని పేర్కొన్నారు. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన ఈ సందర్భంలో క్రీస్తు చెప్పిన మాటలను ఆలోచిద్దాం ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామంలో కూడి ఉన్నారో అక్కడ నేను వారితో ఉంటాను  గత శతాబ్దంగా, మేదక్ కాథెడ్రల్ అనేక మందికి దైవ సాన్నిధ్యానికి కేంద్రంగా నిలిచిందనీ, ఒక విశ్వాసం పెంపొందిన స్థలంగానే కాక అనేకమంది జీవితాలు మారిన ప్రదేశంగా నిలిచిందన్నారు.
మెదక్ కాథెడ్రల్ పునాదిని 20వ శతాబ్దం ప్రారంభంలో మహా కష్టకాలంలో, కరువు వేధించిన సమయంలో వేశారు. రేవరెండ్ చార్లెస్ వాకర్ తమ అపారమైన విశ్వాసంతో దయతో నడిపింపబడుతూ. ప్రజలకు ఉపశమనం ఇచ్చి భవిష్యత్తు తరాల కోసం ఆశకి సౌధంగా నిలిచే దేవాలయాన్ని నిర్మించే స్వప్నం చూసారన్నారు. గోతిక్ రివైవల్ శైలిలో నిర్మించబడిన ఈ కాథెడ్రల్, ఏషియా ఖండంలోని అతిపెద్ద మెదక్ చర్చిలలో ఒకటిగా నిలుస్తోందనీ. 5,000 మందికి పైగా భక్తులను ఆశ్రయించే సామర్థ్యం గల ఈ చర్చి, దాని అద్భుతమైన మినారులు, అందమైన స్టెయిన్‌డ్ గ్లాస్ విండోలు, మరియు స్ఫూర్తిదాయకమైన రూపకల్పనతో, కేవలం శిల్పకళా మాత్రమే కాకుండా, ఈ సమాజం ఉమ్మడిగా కలిసికట్టుగా సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచిందన్నారు. మెదక్ కాథెడ్రల్ కేవలం ఒక నిర్మాణం కాదు; ఇది క్రీస్తు బోధనలకు జీవమిచ్చే ప్రతీక. మీకు తెలిసిన ఈ నా అన్నదమ్ములలో ఎవరికి చేసినా, నాకు చేసినట్లే. ఈ మాటలకు అనుగుణంగా గత శతాబ్దంగా ఈ చర్చి అనేకమందికి విద్య, వైద్యం, మరియు ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం అందించిందనీ గుర్తు చేశారు.
ఈ శతాబ్ది ఉత్సవం కృతజ్ఞతతో పాటు క్రియాశీలతకు పిలుపుగా కూడా నిలుస్తుందనీ. ఈ పవిత్ర స్థలం వారసత్వాన్ని గౌరవించే సమయంలో దాని ప్రేమ, సేవ,  న్యాయానికి చేసే కృషికి మనమందరం మరోసారి సంకల్పం చేసుకుందమని. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరిని మరొకరు ప్రేమించండి అనే క్రీస్తు బోధనకు ఈ కాథెడ్రల్ ప్రతీకగా నిలుస్తుందనీ పేర్కొన్నారు.
ఈ శతాబ్ది ఘట్టం మెదక్ కాథెడ్రల్ పనిని కొనసాగించడానికి మనందరినీ ప్రేరేపించాలన్నారు. అవసరమైన వారికి చేయూత అందించటంలో, సామాజిక న్యాయానికి బలంగా నిలవడంలో, ఈ ప్రపంచంలో ప్రేమా దీప్తిని వ్యాపింపజేయడంలో మన కృషి కొనసాగించాలనీ పిలుపునిచ్చారు.
ఈ 100 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన చర్చిలో కృపానుగ్రహాన్ని దేవునికి సమర్పించుకుంటూ, ఈ గొప్ప దేవాలయాన్ని మనకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానీ అలాగే, ఈ ప్రయాణాన్ని సాధ్యం చేసిన అనేకమంది మిషనరీలు, కార్మికులు, సమాజ నాయకులు, మరియు భక్తుల అంకితభావానికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందమన్నారు.
క్రీస్తు మాటలను నెరవేరుస్తూ,మీరు ప్రపంచానికి వెలుగై ఉండాలి. కొండమీద ఒక పట్టణం దాచబడలేదు మేదక్ కాథెడ్రల్ ఆ పట్టణంలా నిలిచి, ఆధ్యాత్మిక శక్తి  శాంతిని కోరేవారికి మార్గదర్శిగా ఉండాలన్నారు.మేదక్ కాథెడ్రల్ భక్తులందరికీ శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ శతాబ్ది ఉత్సవం, మరొక శతాబ్దపు సేవ, విశ్వాసం, మరియు పరివర్తనకర ప్రభావానికి నాంది కావాలని కోరుకుంటున్నానారు.
 మీ అందరికీ ఒక శుభ క్రిస్మస్ , నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నారు. గౌరవం దేవునికి  భూమిమీద శాంతి అందరికీ అనే సందేశం మన ప్రభువైన యేసు క్రీస్తు మనకు అందించారనీ. అందరి జీవితాల్లో శాంతి, అభివృద్ధి,  విజయాలు ఉండాలని కోరుకుంటున్నాన్నారు.జై హింద్, జై భారత్ అంటూ ముగించారు. చర్చి కమిటీ సభ్యులు శాలూవాతో సన్మానించారు. WhatsApp Image 2024-12-22 at 8.06.50 PMWhatsApp Image 2024-12-22 at 8.06.49 PM (1)ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి దన కిషోర్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, ప్రెస్ బ్రీటర్ ఇంచార్జ్ శాంతయ్య మెదక్ చర్చి కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .