నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి పువ్వాడ..

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి పువ్వాడ..

ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:

బుధవారం నూతన సంవత్సరం సందర్బంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం విచ్చేసి వారి నివాసం నందు కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలంలో వారు చేసింది ఏమి లేదని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మభ్య పెట్టారని రైతులను,మహిళలను మోసం చేసారని హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయడంలో విఫలం అయ్యిందని అన్నారు.
జమిలి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు బుద్ది చెప్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదనలాల్,చంద్రావతి,నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,
సీనియర్ నాయకులు ఆర్ జె సి కృష్ణ,టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్ర రెడ్డి,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,మండల అధ్యక్షులు వీరునాయక్, కార్పొరేటర్లు,మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .