మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ సంతాపం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతి పట్ల బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడిన అబ్బయ్య సేవలు మరువలేనివి అన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధిలో తన ముద్ర వేశారని అలానే ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి ఆయన అహర్నిషలు కృషి చేశారన్నారు. 2009లో తాను ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచిన సమయంలో అబ్బయ్యకు ఇల్లందు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మాజీ ఎంపీ నామ గుర్తు చేసుకున్నారు. అబ్బయ్య గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.


Comments