మాజీ ఎంపీ నామ ఆశీర్వాదాలు, పరామర్శలు
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 6, తెలంగాణ ముచ్చట్లు;
బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించారు. అలాగే కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా ఖమ్మం పట్టణం, టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో రిటైర్డ్ టీచర్ నాగబత్తిన భాస్కర్ కుమారుడు వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త, మార్కెట్ దిగుమతి శాఖ సీనియర్ సభ్యులు గొడవర్తి రామారావు ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. ఈ సందర్భంగా సోమవారం వీడియోస్ కాలనీలోని వారి కుమారుడు స్వగృహం కు వెళ్లి రామారావు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుమారులు గొడవర్తి శ్రీనివాసరావు, నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. తర్వాత ప్రముఖ ఛాతి వైద్యనిపుణులు డాక్టర్ కిషోర్ బాబు తండ్రి సాతంబేడు ముని రామయ్య ఇటీవల మృతి చెందగా నెహ్రూనగర్ లోని వారి స్వగృహానికి నామ వెళ్లి రామయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, కిషోర్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించినారు. ఈ కార్యక్రమాల్లో నామతో పాటు కనకమేడల సత్యనారాయణ, బాణాల వెంకటేశ్వర్లు, గోడ్డేటి మాధవరావు, మోరంపూడి ప్రసాదరావు, చావా రాము, చిగురు ప్రభాకర్, తన్నీరు రవి, వాకదాని కోటేశ్వరరావు, రేగళ్ల కృష్ణప్రసాద్, పగడాల రవి తదితరులు పాల్గొన్నారు.


Comments