నాచారం–మల్లాపూర్ డివిజన్ సరిహద్దుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నాచారం, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ నాచారం మరియు మల్లాపూర్ డివిజన్‌ల సరిహద్దుల్లో మొత్తం రూ.75 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.బాబా నగర్ మరియు హనుమాన్ నగర్ ప్రాంతాల్లో రూ.40 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు, అలాగే బాబా నగర్‌లోని పలు ప్రాంతాల్లో రూ.35 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు మల్లాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న బాబా నగర్, దుర్గా నగర్ ప్రాంతాలు నాచారం డివిజన్‌లోకి వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉన్న అన్ని మౌలిక సదుపాయాల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.అభివృద్ధి
పనులకు నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని, అలాగే నాచారం–మల్లాపూర్ కార్పొరేటర్లను స్థానిక ప్రజలు శాలువాలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జలమండలి డిజిఎం సతీష్, ఏఈ సిరాజ్, ఇంజనీరింగ్ డీఈ రూప, ఏఈ స్రవంతితో పాటు బాబా నగర్, హనుమాన్ నగర్‌కు చెందిన బస్తివాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments