తోటి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు
వనపర్తి జిల్లా ప్రతిని తెలంగాణ ముచ్చట్లు:
అడ్డాకుల మండలంలో ఇటీవల విద్యుత్ అంతరాయంలో భాగంగా మరమ్మతులు చేస్తూ, విద్యుత్ షాక్ ప్రమాదం చెంది మరణించిన అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన అడ్డాకుల మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ లైన్మెన్ మునగల రవి కుటుంబానికి అండగా నిలుస్తూ..
చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న అడ్డాకుల మండల కేంద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ 2008 -09 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన, బాల్యమిత్రులు ( క్లాస్మేట్స్ ) అందరు కలిసి తోటి స్నేహితుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించుకొని బృందంగా ఏర్పడి చేయి చేయి కలిపి చేతనైనంత సాయాన్ని అందించాలని నిర్ణయించారు. తోటి స్నేహితులందరూ కలిసి రూ,50,400 /- (యాబ్భై వేల నాలుగు వందలు) సేకరించారు. ఆ జమ నగదు మొత్తాన్ని కీ "శే " మునుగల రవి భార్య మరియు కుమారుని పేరిట పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఫిక్స్ డిపాజిట్ చేశారు. ఫిక్స్ డిపాజిట్ పేపర్ పత్రాన్ని మునగల రవి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తోటి స్నేహితులు పవన్ యాదవ్, 2008 -09 పదవ తరగతి తోటి స్నేహితులు ( క్లాస్మేట్స్ ),వారి తో పాటు పాల్గొనడం జరిగింది.


Comments