గీతా హుండై షోరూం వారి ఆల్వేస్ అరౌండ్ క్యాంప్ కు ప్రారంభం

గీతా హుండై షోరూం వారి ఆల్వేస్ అరౌండ్ క్యాంప్ కు ప్రారంభం

మల్లాపూర్, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

మల్లాపూర్ డివిజన్‌లోని మై ఫ్లవర్ అపార్ట్‌మెంట్స్ ప్రాంగణంలో గీతా హుండై షోరూం ఆధ్వర్యంలో “ఆల్వేస్ అరౌండ్ క్యాంప్” కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ప్రారంభించి, హుండై సంస్థ అందిస్తున్న కస్టమర్ సర్వీస్ కార్యక్రమాలను అభినందించారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ, “కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడంలో గీతా హుండై సంస్థ ఎల్లప్పుడూ ముందుంటోంది. వాహన సేవలలో విశ్వసనీయత, సమయపాలన, వినియోగదారుల సంతృప్తి వంటి అంశాలు అత్యంత ముఖ్యమైనవి. ఇలాంటి క్యాంపులు ప్రజలకు మరింత సౌకర్యం కలిగిస్తాయి” అని అన్నారు.క్యాంప్‌లో భాగంగా వాహనాలకు ఉచిత తనిఖీ, ఇంజిన్ ఆయిల్ స్థాయి, బ్రేక్ సిస్టమ్, బ్యాటరీ, టైర్లు, ఎసి ఫిల్టర్ వంటి పలు సర్వీసులు నిర్వహించబడ్డాయి. వాహన యజమానులకు సలహాలు, రాయితీ ఆఫర్లు కూడా అందించబడినట్లు షోరూం జనరల్ మేనేజర్ అబ్దుల్ హామీద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్వీస్ మేనేజర్ మిస్కిన్ పాషా, టెక్నికల్ టీం సభ్యులు, యాజమాన్య ప్రతినిధులు, వాహన యజమానులు, స్థానికులు పాల్గొన్నారు.క్యాంప్‌ ద్వారా గీతా హుండై కస్టమర్లతో అనుబంధాన్ని బలోపేతం చేస్తూ, మరింత మెరుగైన సేవలు అందించడానికి సంకల్పబద్ధంగా ఉన్నట్లు యాజమాన్యం తెలిపింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .