జై జవాన్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకున్న జిహెచ్ఎంసి

12 ఏళ్లుగా సాగిన పోరాటానికి ముగింపు

జై జవాన్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకున్న జిహెచ్ఎంసి

కాంప్లెక్స్‌లోని 10 షట్టర్లకు జిహెచ్ఎంసి అధికారులు తాళాలు

షట్టర్లను టెండర్ల ద్వారా నిరుద్యోగ యువతకు కేటాయించాలని డిమాండ్


ఏఎస్ రావునగర్, ఆగస్టు 21(తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావునగర్ డివిజన్ జై జవాన్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్‌ను ఎట్టకేలకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) స్వాధీనం చేసుకుంది. గురువారం జిహెచ్ఎంసి డిప్యూటీ ఎస్టేట్స్ ఆఫీసర్ లావణ్య సిబ్బందితో కలిసి కాంప్లెక్స్‌లోని 10 షట్టర్లకు తాళాలు వేసి స్వాధీనం ప్రక్రియ పూర్తి చేశారు.

ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇన్నాళ్లు కాలనీ సంక్షేమ సంఘం ఆధీనంలో ఉండేది. దీని స్వాధీనంపై సంవత్సరాలుగా వివాదం కొనసాగుతూ వచ్చింది.

సమాచార హక్కు సాధన సమితి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కన్వీనర్ తాడూరి గగన్ కుమార్ మాట్లాడుతూ, “దాదాపు 12 ఏళ్లుగా సాగిన మా పోరాటానికి ఇది ఫలితం. అనేకసార్లు విజ్ఞప్తులు, ఫిర్యాదులు చేసిన తర్వాత ఈ రోజు సమస్య పరిష్కారమైంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా మన డిమాండ్ నెరవేరింది” అని తెలిపారు.

జిహెచ్ఎంసి ఎస్టేట్ విభాగం అధికారులతో పాటు ఈ సమస్యను ప్రజల ముందుకు తీసుకువెళ్లిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు గగన్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

అలాగే, స్వాధీనం చేసుకున్న షట్టర్లను ఓపెన్ టెండర్ల ద్వారా నిరుద్యోగ యువతకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గత 12 సంవత్సరాలుగా అద్దె రూపంలో వసూలైన దాదాపు ఒక కోటి రూపాయలను ప్రభుత్వం రికవరీ చేయాలని కోరారు. అవసరమైతే ఈ విషయమై న్యాయపోరాటం కూడా చేస్తామని గగన్ కుమార్ స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .