పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్నదానం..

అన్నదానాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్,  వైరా ఎస్సై

పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్నదానం..

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

వైరా మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డ్ లో బాలిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావస కేంద్రంలో బాధితులకు శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ వేణు వైరా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు చేతుల మీదుగా అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాడుపడిన ఇండ్లు, కూలే ఇళ్లల్లో ఉండవద్దని పునరావాస కేంద్రానికి రావాలని తెలిపారు. వాగులు వంకలు ప్రవహిస్తున్నందున ప్రజలందరూ అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచించారు. గత రెండు మూడు రోజుల నుండి వర్షాలు భారీగా కురుస్తున్నందున మండలంలోని ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలని అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో  ఎస్ఐ పవన్, పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250817-WA0070

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .