గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలి.
జిల్లా అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు.
దమ్మపేట, ఆగస్టు 20(తెలంగాణ ముచ్చట్లు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఎస్పీ రోహిత్ రాజు తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి తుమ్మల. ఎగువ నుంచి వరద ఉదృతి తో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరు వరద ప్రవాహం ఉండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం రామాలయం వద్ద కరకట్ట స్లూయిస్ లీకేజ్ లు లేకుండా సుభాస్ నగర్ కాలనీ వైపు వరద నీరు భద్రాచలం పట్టణంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గత వరదల అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ రెవెన్యూ పంచాయితీ రాజ్ సిబ్బంది సన్నదంగా ఉండాలని మంత్రి తుమ్మల తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని వరద ఉదృతి ఎక్కువైతే పునరావస కేంద్రాల ఏర్పాటు గజ ఈతగాళ్లు ఎన్.డీఆర్ ఎఫ్ టీంలు వైద్య సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని, రైతులు పశువులు కాపరులు వాగులు వంకలు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీస్ సిబ్బంది వాగులు కల్వర్టుల వద్ద బందోబస్తుగా ఉండాలని, ఏ ఒక్కరికి ప్రాణ నష్టం లేకుండా అత్యవసర వైద్య సేవలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Comments