ఈ నెల 12న ఇందిరా పార్క్ వద్ద గొల్లకురుమల ధర్నా
సమస్యల పరిష్కారానికి డిమాండ్
Views: 2
On
జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
గొర్రెల మేకల పెంపకందారుల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో డిసెంబర్ 12న, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (GMPS) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌కు వినతిపత్రం అందజేసి తమ డిమాండ్లను వివరించారు.
సమస్యలు మరియు డిమాండ్లు:
జిల్లా అధ్యక్షులు మోటే దేవేందర్, జిల్లా కార్యదర్శి సాదం రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా రెండో విడత గొర్రెల పంపిణీ కోసం రూ.2 లక్షల నగదు బదిలీ చేస్తామని చెప్పినా, సంవత్సరం గడుస్తున్నా ఆ హామీ అమలుకాకపోవడం నిరాశ కలిగించిందని విమర్శించారు.
గత ప్రభుత్వంలో 80 వేల లబ్ధిదారులు రూ.43,750 చొప్పున డీడీలు తీసి కూడా గొర్రెలను పొందలేక మోసపోయారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా డీడీలను రిటర్న్ చేస్తూ మూసివేత వ్యవహారాన్ని కొనసాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పశువైద్యశాలల్లో మందుల కొరత, మేత వనరుల దుర్భిక్షం, ఫారెస్ట్ అధికారుల వేధింపులు, కుక్కల దాడులు, గొర్రెల దొంగతనాలు వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని వారు తెలిపారు.
డిమాండ్లలో ప్రధానంగా:
1. రెండో విడత గొర్రెల పంపిణీ: దళారుల ప్రమేయం లేకుండా రూ.2 లక్షల నగదు బదిలీ.
2. ఉచిత ఇన్సూరెన్స్: అన్ని గొర్రెలు, మేకలకు.
3. నట్టల నివారణ: మూడు నెలలకోసారి ఉచిత మందులు, వాక్సిన్లు అందించాలి.
4. పశువైద్యశాలల ఆధునీకరణ: సిబ్బంది నియామకం, సేవల విస్తరణ.
5. పించన్ పథకం: 50 ఏళ్లు పైబడి గొర్రెల కాపరులకు నెలకు రూ.5,000.
6. ప్రమాద పరిహారం: మరణాలపై రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో.
7. పాలమూరు పరిశోధన కేంద్ర అభివృద్ధి: 350 ఎకరాల భూమి కేటాయింపు.
8. సంతల పరిపాలన: సొసైటీల ఆధ్వర్యంలో తూకం పద్ధతిలో కొనుగోళ్లు.
ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు, ఉపాధ్యక్షులు గుండ వెంకటయ్య, ఇతర నాయకులు బూమాండ్ల కుమారస్వామి, బోళ్ల రాజ్ కుమార్, గద్ద రాజు, ఆవుల ప్రభాకర్, పంతంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments