ప్రమాదపుటంచుల్లో గోపాల సముద్రం (వెల్టూర్ చెరువు)
చిన్నపాటి వర్షాలకే కోతకు గురవుతున్న చెరువు కట్ట
• కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఫామ్ హౌస్ ఏర్పాటు
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామం చెరువు (గోపాల సముద్రాన్ని) దాదాపు 12 కోట్ల రూపాయల తో పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తూ పటిష్ట పరుస్తామని గత ప్రభుత్వం చెరువు నిర్మాణ పనులను చేపట్టింది. కోట్ల రూపాయలు కొల్లగొట్టి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చెరువు కట్టను నిర్మించారని నేడు చిన్నపాటి వర్షాలకు చెరువు కట్ట కోతకు గురవుతుందని గ్రామంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెల్టూరు చెరువు కట్ట కోతకు గురైన ప్రాంతాన్ని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు పరిశీలించారు. చెరువు కట్ట వెనకాల బుగ్గ పడి చెరువులోని నీరు లీక్ అవుతుంది చెరువు కట్టను ఆధునికరించి ,మినీ ట్యాంక్బండ్ ఏర్పాటు చేస్తామని గత పాలకులు చెప్పి నాణ్యత ప్రమాణాలు లేకుండా చెరువు కట్టను నిర్మించారాని ప్రజలు వాపోతున్నారు. కోట్ల రూపాయల కొల్లగొట్టి పక్కనే ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు తప్ప నాణ్యత ప్రమాణాలను పట్టించుకోలేదని, నాసిరకంగా చెరువు కట్ట నిర్మాణ పనులు చేపట్టడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అభివృద్ధి చేశామని ఫోటోకోసారి వేదాలు వల్లించే నాయకులు నడిచెరువు కట్ట లీకేజీల పై స్పందిస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నారు. సప్త సముద్రాల్లో ఒకటైన చెరువు కట్ట అప్పటి రాజుల కాలం నుంచి ఎంతో పటిష్టంగా ఉండేదని అలాంటి కట్టను ఆధునికరిస్తామని అందిన కాడికి దోచుకున్నారే తప్ప పట్టించుకోలేదని విమర్శించారు. ఫామ్ హౌస్ లో ఏర్పాటు పై ఉన్న శ్రద్ధ కట్ట నిర్మాణం పెట్టలేదని, నేడు ప్రజలందరికీ అర్థమైందా అని గ్రామస్తులు పేర్కొన్నారు.
మినిమం నాణ్యత ప్రమాణాలు లేని మినీ ట్యాంక్ బండ్
బుంగపడి లీక్ అవుతున్న చెరువు కట్ట ఆందోళనలో అన్నదాతలు.
12 కోట్ల రూపాయలు నీటిపాలు
పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ చెరువు (గోపాల సముద్రాన్ని) పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తూ... పటిష్ట పరుస్తామని గత పాలకులు చేపట్టిన పనులు నేడు పూర్తిగా శిథిలమైపోయాయి చెరువు కట్ట వెనకాల బుంగపడి చెరువులోని నీరు లీక్ అవుతుంది.
చెరువు కట్టను ఆధునికరించి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన గత పాలకులు కనీసం నాణ్యత ప్రమాణాలు లేని చెరువు కట్ట నిర్మించారని ప్రజలు వాపోతున్నారు.
కోట్ల రూపాయలు కొల్లగొట్టి పక్కనే ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారేతప్ప నాణ్యత ప్రమాణాలు పట్టించుకోలేదని వాపోతున్నారు.అభివృద్ధి చేశామని పూటకోసారి వేదాలు వల్లించే నాయకులు నేడు చెరువు కట్ట లీకేజీలపై స్పందిస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నారు.సప్త సముద్రాల్లో ఒకటైన చెరువు కట్ట అప్పటి రాజుల కాలం నుంచి ఎంతో పటిష్టంగా ఉండేదని అలాంటి కట్టను ఆధునికరిస్తామని అందిన కాడికి దోచుకున్నారే తప్ప పట్టించుకోలేదని విమర్శించారు.
ఫామ్ హౌస్ ల ఏర్పాటు పై ఉన్న శ్రద్ధ కట్ట నిర్మాణం పెట్టలేదని నేడు ప్రజలందరికీ అర్థమైందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంగ్లా బాబు, మాజీ సర్పంచ్ బాలచంద్రయ్య, మహేశ్వర్ రెడ్డి, వివేక్ సాగర్, రామచంద్రయ్య, గుండెల ఆంజనేయులు, పట్నం సత్యన్న, కుమ్మరి కొండన్న, అనంతరెడ్డి, చందు రెడ్డి, చిలక టోని పల్లి డీలర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Comments