ప్రస్తుత పట్టణాలను విస్మరిస్తున్న ప్రభుత్వం
పట్టణాలను విస్మరించడం అంటే పేదలను పట్టించుకోకపోవడమే
సిపిఐ (ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28, తెలంగాణ ముచ్చట్లు:
ప్రస్తుత నగరాలను విస్మరించి ఫ్యూచర్ సిటీలను నిర్మించడం వల్ల పేద ప్రజలకు ఏమి ఉపయోగమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఖమ్మం నగర పరిది లోని త్రీ టౌన్ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని,త్రీ టౌన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఐ (ఎం) ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బోస్ సెంటర్ నుండి కాల్వ ఒడ్డు సెంటర్ వరకు నిర్వహించిన పాదయాత్ర ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం ఆయన 31వ డివిజన్ కార్పొరేటర్ యర్రా గోపి అధ్యక్షతన జరిగిన సభలో పోతునేని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు చేస్తూ మేము తెలంగాణ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తామని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మా పోటీ కాదు ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన నగరాలతో మేము పోటీ పడతామని చెప్పి పాత నగరాలను విస్మరించి ఫ్యూచర్ సిటీలు నిర్మిస్తామని ఎంతో గొప్పలు చెప్తున్నారని ఆరోపించారు. ఒకపక్క పాత నగరాలు ప్రజా సమస్యల నిలయంగా మారుతున్నాయని పాత నగరాలు పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ నిర్మించడం వల్ల ఉపయోగం ఏమిటని ఆయన ఈప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పేద ప్రజలు ఎక్కువగా నివసించేది పాత నగరాలలో నని ,పాత నగరాలను విస్మరించడం అంటే పేద ప్రజలను అభివృద్ధి నుంచి దూరం చేయడమేనని అన్నారు.వారి సమస్యలను గాలికి వదిలేయడమే అని ప్రభుత్వాన్ని విమర్శించారు .తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన జిల్లాల్లో ఖమ్మం జిల్లా ఒకటి అని,అలాంటి ఖమ్మం జిల్లా నడిబొట్టున ఉండి వ్యాపార,రాజకీయా ల నిర్వహణకి ముఖ్యమైన కేంద్రంగా ఉన్న త్రీ టౌన్ ప్రాంతం సమస్యల వలయంలో చిక్కుకొని విలవిలలాడుతుందని దుయ్యబ్టారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందటంఅంటే ఖమ్మం నగర కేంద్రం అభివృద్ధి చెందినట్లు అని తెలిపారు. ఎంతోమంది రాజకీయ నాయకులు ఖమ్మం నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రులైన ఖమ్మం త్రీ టౌన్ ని పూర్తి స్థాయిలో ఎక్కడ అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు.ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతం అంటే పేద ప్రజలు నివసించే ప్రాంతమని, అలాంటి ప్రాంతంలో పేదలు ఉంటారు కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని భ్రమల్లో నేటి పాలకులు ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్రీ టౌన్ ప్రాంతం అభివృద్ది కి నిధులు కేటాయించి నగర అభివృద్ది కి పాటు పడాలని డిమాండ్ చేశారు. లేనియెడల తమ పార్టీ ఆద్వర్యంలో దశాల వారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
అనంతరంసిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ ఖమ్మం త్రీ టౌన్ లో ఇప్పటివరకు మినీ స్టేడియం, ప్రభుత్వ హాస్పిటల్ లేవని విమర్శించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో త్రీ టౌన్ ప్రాంతం ఉన్నదని ఇలాంటి త్రీ టౌన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల పలు ప్రాంతాల్లో ని రోడ్లు కంకర తేలి భయంకరం గా తయారయ్యాయి అన్నారు. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కంపు కొడుతోందని ఆరోపించారు.రోడ్లు , డ్రైన్లు అభివృద్ధి కావాలి అంటే త్రీ టౌన్ కి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం ) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ ,పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్ నందిపాటి మనోహర్ ,మెరుగు సత్యనారాయణ, త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ రావు ,డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు వజినేపల్లి శ్రీనివాస్ రావు, పత్తిపాక నాగ సులోచన, బండారు యకయ్య, 35వ డివిజన్ కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు, త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు వీరబాబు, యర్రా రంజిత్ ఎస్కే ఇమామ్ ,శీలం వీరబాబు , ఎస్ కే సైదులు ,యర్రా మల్లికార్జున్, త్రీ టౌన్ కమిటీ సభ్యులు పోతురాజు జార్జి, ఎస్ కే బాబు గబ్బేటి పుల్లయ్య ,ఎర్ర నగేష్ సారంగి పాపారావు ,రంగు, హనుమంతచారి ,ఎస్కే.ఖాసీం,ఎస్కే .అమీనా, మీనాల మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు..


Comments