కోటి మంది మహిళలను కోటీశ్వరుడు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. 

పంచాయతీరాజ్ శ్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క 

కోటి మంది మహిళలను కోటీశ్వరుడు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

మహిళల అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను అత్యుత్తమ వ్యాపారం వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మహిళల సంక్షేమంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఈ సత్యాన్ని గమనించే రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్ద పీఠ వేస్తున్నదని తెలిపారు. మహిళలు అనేక రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తూ మంచి పేరు తీసుకొచ్చుతున్నారని, సోలార్  పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యతలను కూడా మహిళలకు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా దాదాపు 100 బస్సులను మహిళలు  నిర్వహించుకునేలా అప్పగిస్తామని తెలిపారు. ఒక ఉద్యమంలో మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారు. 

కాళోజి కలెక్షేత్రం ప్రారంభంలో పాల్గొనడం ఆనందంగా ఉంది..ఆయన స్ఫూర్తి ప్రదాత 

మంత్రి జూపల్లి కృష్ణారావు 

వరంగల్లో కాళోజి కళాక్షేత్రం ప్రారంభంలో తను పాల్గొనడం గొప్ప ఆనందం ఇస్తున్నదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కాళోజి గొప్ప స్ఫూర్తి ప్రదాత అని, ఆలోచించి చూపిన బాట అనుసరణీయమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీటవేస్తున్నదని చెప్పారు. అలాగే ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నదని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి చేతికి చిప్ప అప్పగించారని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెబితే అది నిజం అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని విష ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. 

సమగ్ర సర్వేలో ప్రజలంతా భాగస్వామిలు కావాలి..

 రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశానికే దిక్సూచిగా నిలుస్తున్న కుల గణన ఇంటింటా సమగ్ర సర్వేలో ప్రజలంతా బాగా స్వాములు కావాలని పేర్కొన్నారు. 
ప్రజా పాలన ఏడాది పూర్తి చేసుకున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని సూచించారు. 
కాళోజీ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించి ప్రారంభించుకున్నామని,
ప్రజా పాలన కింద ఏర్పడిన ప్రభుత్వం  మనం మనమంతా అనే విధంగా ఏర్పడిందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ను గుర్తు చేసుకుంటూ మహిళలంతా ఉచిత ఆర్టీసీ బస్సు ద్వారా 110 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని, 3720 కోట్ల మేర డబ్బులు ఆదా అయ్యాయాన్ని తెలిపారు. 
మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 
కుల సర్వే లో ప్రతి ఒక్కరూ  భాగస్వామ్యం కావాలి.. ఎవరైనా ఇంకా సర్వే లో పాల్గొనని వారు ఉంటే సర్వేలో పాల్గొనేలా చెయ్యాలని కోరారు. 

మూసి పునర్జీవనం అడ్డుకుంటే పుట్టగతులు ఉండవు..

ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

రాష్ట్ర ప్రభుత్వం మూసి నిర్వాసితులకు గొప్ప జీవన విధానం అందించేందుకు గాను మూసి పునర్జీవనానికి శ్రీకరం చుట్టిందని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మూసి పునర్జీవనాన్ని బిజెపి, టిఆర్ఎస్ లు అడ్డుకుంటున్నాయని, వారికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. ప్రజలు అలాగే ఇబ్బందుల మధ్య జీవించాలని టిఆర్ఎస్, బిజెపి నేతలు అనుకుంటున్నారని ఎవరెన్ని కుట్రలు చేసినా మూసి పునర్జీవనం ఆగిపోదని ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్టదాలతో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఇది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం అని వారికి మెరుగైన జీవన విధానం అందించాలని మూసి పునర్జీవనానికి ప్రభుత్వం నడుం బిగించిందని పేర్కొన్నారు. లేనిపోని కుట్రలు విమర్శలు చేస్తూ మూసి పునర్జీవనాన్ని మాత్రం అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. 


ఎంత ఇబ్బంది ఉన్నా హామీలను నెరవేరుస్తాం..

ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు 

గత బిఆర్ఎస్ పాలకుల నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అమలు చేసి తీరుతామని దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. గత టిఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను మోసగించారని మండిపడ్డారు. వారి నిర్వాకం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందని దీంతో తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ హామీలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. బి ఆర్ ఎస్ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం ఎల్లప్పుడు అండగా ఉంటుందని గుర్తుంచుకోవాలని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .