గ్రామపంచాయతీ సపాయి కార్మికుడు మృతి.
హసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న రేణిగుంట్ల ఐలయ్య గురువారం ప్రమాదవశాత్తు మృతిచెందగా గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం అతని పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం నుండి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు.
మృతుడు ఐలయ్యకు భార్య ప్రమీల ముగ్గురు కుమార్తెలు కలరు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి హరిదాస్యం వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు గుండ్లపల్లి వెంకన్న గౌడ్, కార్యదర్శి అనగాని రవీందర్, బిల్ కలెక్టర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాతల్ల సదానందం, జిల్లా అధ్యక్షుడు తగరం శివ, మండల అధ్యక్షుడు బండి రమేష్, సాయిని శ్రీధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments