ఘనంగా శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో వాల్మికుల ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామంలో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి, పాలాభిషేకంతో జయంతి వేడుకలను వాల్మీకి సోదరులు నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి సోదరుడు బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మలక్ సురేష్ మాట్లాడుతూ.. ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి వేటగాని వృత్తితో జీవితం గడిపి సప్త ఋషుల బోధన ద్వారా మహర్షి వాల్మీకి గా మారి అద్భుతమైన రామాయణం గ్రంధాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శాఖ వెంకటయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లక్ సురేష్, పెద్ద భీమన్న, రాములు, కావలి నాగన్న, మల్లక్ కృష్ణయ్య, ఆంజనేయులు, జింకల బాలరాజ్, జింకల చిన్న కుమార్, శ్రీను, శాఖ వెంకయ్య, శాఖ మన్నెం, ముమ్మాళ్ళ వెంకటేష్, జల్లి కురుమూర్తి, చిన్న కాశన్న, గుర్రాల ఎల్లప్ప, బసరత్, మన్నెంకొండ, పెద్ద కాశన్న, బోయ దానప్ప, శాఖ పెద్ద కొండయ్య, బోయ శేఖర్, కావలి ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.


Comments