డిఆర్డిఓ కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ ముందస్తు వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను,డీడీ శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై క్రిస్మస్ కేకును కోశారు.ఈ సందర్భంగా మేన శ్రీను మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ఆనందంతో జరుపుకునే విశిష్టమైన పండుగ అని అన్నారు. క్రైస్తవ సోదరులు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జీసస్ చేసిన మార్గదర్శక కృషి మనకు ఐక్యత, సేవాభావం, సత్యనిష్ఠను నేర్పుతుందని తెలిపారు.డీడీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను ఐక్యత, స్నేహభావానికి చిహ్నంగా చూడాలని, ఇతరులకు సహాయం చేయడంలో ముందుండాలని సూచించారు. జీసస్ ప్రవక్త చెప్పిన ప్రేమ, సహనం, సేవ అనే మూల్యాలను అనుసరిస్తూ జీవించాలని అన్నారు.ఈ వేడుకలో అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు, సెర్ప్ అదనపు అధికారి సుదీర్, కార్యాలయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీనివాస్ స్వామి, ఇందిర, తహసీల్దార్ మహేశ్వరెడ్డి, జిల్లా ప్రాజెక్టు అధికారి దాసు, సంపత్ కుమార్,
ఊర్మిళ, మాధురిక, జోయెల్ తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments