భోగర్భ డ్రైనేజీ పనులకు నిధులను మంజూరు
రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కప్పర సాయి కిరణ్
నాచారం, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గం లోకాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ అన్నారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ ఫేస్ టు రోడ్లు మరియు భోగర్భ డ్రైనేజీ పనులకు నిధులను మంజూరు. చేసినందుకు కాలనీ వాసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కప్పర సాయికిరణ్ గౌడ్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, వర్షాకాలం కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. నేటి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయామని కాలనీవాసులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ కాలనీ అభివృద్ధి కోసం ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా నిధులు మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు. కాలనీ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డికి సాయి కిరణ్ లకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, దంతురి రాజు గౌడ్, జెమిలా బేగం, డివిజన్ వర్కింగ్ ప్రాసిడెంట్ కోయగూర బాలరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు మనోహర్, డివిజన్ వైస్ ప్రాసిడెంట్ జానీభై, పర్వతాలు, మ్యూజిబ్, యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుపుల జయంత్, ప్రణీత్, అజిమ్, మరియు కాలనీ అధ్యక్షులు అల్తాప్, మురళి, విజయ్, ప్రశాంత్, కాలని వాసులు పాల్గొన్నారు


Comments