ఘనంగా పోచమ్మ బోనాలు 

ఘనంగా పోచమ్మ బోనాలు 

వేలేరు:

శ్రావణమాస బోనాలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుండగా వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రోజున గ్రామాల్లో ప్రతి ఇంటి నుండి బోనాలు ఎత్తుకొని మహిళలు ఆలయానికి బయలుదేరారు అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు శివసత్తులు, యాదవ రాజుల డోల్ల కళాకారుల విన్యాసాలతో యువకుల కేరింతల మధ్య బోనాలు ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్తులంతా పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు గ్రామంలోని ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి చూడాలని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి వేడుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోదల రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ బాల్లె వెంకటేశ్వర్లు, మాజీ వార్డు సభ్యుడు సమ్మయ్య యాదవ్, మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ , కోటిలింగం సాంబయ్య మహేందర్ రవి, యాదవ డొల్ల సంఘం అధ్యక్షుడు గట్టయ్య ఉపాధ్యక్షుడు రవి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .