జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
-గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై సమీక్ష
Views: 23
On
హన్మకొండ, తెలంగాణ ముచ్చట్లు:
కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లాలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 82 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 33,005 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు.
పరీక్షలు డిసెంబర్ 15 మరియు 16వ తేదీలలో నాలుగు దఫాలుగా నిర్వహించబడతాయి.
• డిసెంబర్ 15: ఉదయం 10:00 నుండి 12:30, మధ్యాహ్నం 3:00 నుండి 5:30
• డిసెంబర్ 16: ఉదయం 10:00 నుండి 12:30, మధ్యాహ్నం 3:00 నుండి 5:30
అభ్యర్థులు పరీక్షా కేంద్రాలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం ప్రవేశించాలి. మొబైల్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకూడదని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి, భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకు లేదా మధ్యాహ్నం 1:30 కు పరీక్షా కేంద్రాల్లో హాజరుకావాలని, పరీక్షా కేంద్రాలలో విద్యుత్ సదుపాయం, టాయిలెట్స్, త్రాగునీరు వంటి మౌలిక వసతులు సరియైనదిగా కల్పించాలని సూచించారు.వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కేంద్రాల వద్ద సానిటేషన్ నిర్వహించాలని కూడా సూచించారు.
పరీక్ష కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బట్టుపల్లి ఎస్ ఆర్ ప్రైమ్ కళాశాలలో పరీక్ష కేంద్రం కేటాయించబడిన అభ్యర్థులకు హనుమకొండ బస్టాండ్ నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వై.వి. గణేష్, జిల్లా అధికారులు, గ్రూప్ 2 పరీక్షల ప్రత్యేక అధికారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments