తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం
Views: 43
On
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం, సోమవారం గ్రూప్-2 పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 783 పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌కు 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ పరీక్షల కోసం 58 ప్రాంతీయ కేంద్రాల్లో 1368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు నాలుగు పేపర్లుగా నిర్వహించనున్న ఈ పరీక్షలకు డిసెంబర్ 15, 16 తేదీలు నిర్ణయించబడ్డాయి. అభ్యర్థులు హాల్ టికెట్లు డిసెంబర్ 9 నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షా వివరాలు:
• డిసెంబర్ 15 (ఆదివారం):
• పేపర్-1: ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
• పేపర్-2: మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 5.30 వరకు
• డిసెంబర్ 16 (సోమవారం):
• పేపర్-3: ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
• పేపర్-4: మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 5.30 వరకు
ప్రతి పేపర్‌కు 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలు వ్రాయడానికి అభ్యర్థులకు ఓఎంఆర్ షీట్‌ను అందజేస్తారు.
భారీ బందోబస్తు ఏర్పాట్లు:
గ్రూప్-2 పరీక్షలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు 6,865 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నారు. 49,843 మంది విద్యాసంస్థల సిబ్బందితో పాటు 1,719 మంది జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పరీక్ష నిర్వహణలో పాల్గొంటారు.
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన నిబంధనలు:
1.ప్రతి పేపర్ ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తారు (ఉదయం 9.30, మధ్యాహ్నం 2.30).
2.అభ్యర్థులు ఉదయం 8.30 నుంచి, మధ్యాహ్నం 1.30 నుంచి పరీక్ష కేంద్రంలో ప్రవేశించవచ్చు.
3.హాల్ టికెట్, ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి.
4.బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే అనుమతిస్తుంది.
5.ఎలక్ట్రానిక్ వస్తువులు, అదనపు స్టేషనరీ, పేపర్లను అనుమతించరు.
6.మహిళా అభ్యర్థులకు మంగళసూత్రం, గాజులు తప్ప ఇతర ఆభరణాలు అనుమతి ఉండదు.
7.పరీక్ష కేంద్రాలకు పాదరక్షణల్లో షూస్ అనుమతించరు.
అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను ముందుగా పరిశీలించి, సమయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments