కంప్యూటర్కు ధీటుగా ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ కు అవకాశాలు గుండాల కృష్ణ

యస్.బి.ఐ.టి. లో ఘనంగా ఈ.సి.ఈ. మరియు ఈ. ఈ.ఈ. స్వాగత వేడుకలు

కంప్యూటర్కు ధీటుగా ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ కు అవకాశాలు గుండాల కృష్ణ

 ఆనందోత్సహాల మధ్య నూతన విద్యార్థులకు ఆహ్వానం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

పెరుగుతున్న కంప్యూటర్ సైన్స్ కోర్సుల ఆదరణ తో రానున్న రోజులలో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్లు విపరీతమైన కొరత ఏర్పడే అవకాశం ఉందని తద్వారా నైపుణ్యం కలిగిన ఈ.సి.ఈ. మరియు ఈ.ఈ.ఈ. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉన్నట్లు యస్.బి.ఐ.టి. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. శనివారం కళాశాల ఆవరణలో నిర్వహించిన స్వాగత వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రోబొటిక్స్, డ్రైవర్స్ కార్ మరియు పారిశ్రామిక రంగాలలో కంప్యూటర్ సైన్స్ కు ధీటుగా ఎలక్ట్రికల్ విద్యార్థులకు మంచి ఆదరణ లభిస్తుందని వారికి సూచించారు.
ప్రభుత్వరంగ సంస్థలలో ప్రత్యేకించి జెన్కో, ట్రాన్స్కో, బి.హెచ్.ఈ.యల్, మరియు ఇతర రంగాలలో మెరుగైన ఉద్యోగ అవకాశాలతో పాటు కంప్యూటర్ సైన్స్ సంబందిత కోర్సులను నేర్చుకోవడం ద్వారా రెండు విధాల ఎలక్ట్రికల్ విద్యార్థులకు ఉపాధి సులభతరం అవుతుందని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. జర్మనీ, కొరియా మరియు జపాన్ వంటి దేశాలలో కూడా విపరీతమైన డిమాండ్ కలిగిన ఏకైక కోర్సు ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ అని వారు అభిప్రాయపడ్డారు.WhatsApp Image 2024-12-07 at 9.22.54 PM
ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్ను అనుసంధానం చేయడం ద్వారా రోబోటిక్స్ మరియు ఎంబడెడ్ ఇంటిలిజెన్స్ వంటి అధునాతన కోర్సుల తో మెడికల్ రోబోటిక్స్, రోబోటిక్స్ సర్జరీలు వంటివి ఆవిష్కరించగలిగామని కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. వి.ఎల్.యస్.ఐ., మరియు ఎంబడెడ్ సిస్టమ్స్ వంటి కోర్సులపై విద్యార్థులు దృష్టి సారించాలని వారు అభిప్రాయపడ్డారు. తదనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు నృత్యాలతో నూతన విద్యార్థులను ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఈ.సి.ఈ. మరియు ఈ.ఈ. ఈ. విభాగ అధిపతులు డా॥ అమిత్ బింధాజ్, డా॥ టి. చరణ్ సింగ్ మరియు కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, డా॥ జె. రవీంద్రబాబు. డా॥ యన్. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .